అంశము : Gboard ఉపయోగించి మొబైల్ లో తెలుగులో రాయటం పాఠ్య లక్ష్యం: మొబైల్ లో తెలుగులో వ్రాయటానికి Gboard (వర్చువల్ కీబోర్డ్ అనువర్తనం) ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి, రాయటం (టైపు) ఎలా ? తెలుసుకొంటారు

ఈ పాఠములో -

  1. Gboard (వర్చువల్ కీబోర్డ్ అనువర్తనం) - పాఠ్యము 10 నిమిషములు (మీరు ఈ పాఠ్యములో సూచనలని పాటిస్తూ భాషా ఉపకారణాలని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు
  2. Gboard(వర్చువల్ కీబోర్డ్ అనువర్తనం) - వీడియో 4.55 నిమిషములు ( వీడియోలో చూపిన క్రమములో మీరు కూడా భాషా ఉపకారణాలని మీ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు)

అభ్యాస ఫలితం : Gboard ను మొబైల్ లో ఇంస్టాల్ చేసుకోవటం, వాటిని ఉపయోగించి తెలుగులో ఎలా టైపు చెయ్యవచ్చో నేర్చుకొంటారు.

alt-text-here

Gboard మొబైల్లో తెలుగులో రాసే గూగుల్ ఉపకరణము

Gboard అనేది స్థానిక Android మరియు iOS పరికరాల కోసం Google చే అభివృద్ధి చేయబడిన వర్చువల్ కీబోర్డ్ అనువర్తనం.

alt-text-here

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో playstore ద్వారా , Gboard ని ఇన్‌స్టాల్ చేయండి.

ఒక వేళ మీ ఫోన్ లో ఇప్పటికే Gboard వుండి ఉంటే enable చేయండి

కొన్ని Android పరికరాల్లో, Gboard ఇప్పటికే డిఫాల్ట్ కీబోర్డ్ గా ఉంటే మీ పరికరం ఇటీవలి సంస్కరణను కలిగి ఉందని నిర్ధారించుకోవడానికి, నవీకరణల కోసం తనిఖీ చేయండి.

కీబోర్డ్ ఎంపికలను సెట్ చేయండి

పద్దతి- 1

మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail లేదా Keep వంటి మీరు టైప్ చేయగల ఏదైనా అనువర్తనాన్ని తెరవండి.

మీరు వచనాన్ని నమోదు చేయగల చోట నొక్కండి.

కీబోర్డ్ ఎగువ ఎడమ వైపున, ఫీచర్స్ మెను తెరువు నొక్కండి, ఫీచర్స్ మెను తెరవండి

alt-text-here

సిస్టం లో languages & Input దగ్గర Gboard ఎంచుకొండి

కీబోర్డ్ ఎగువ ఎడమ వైపున, ఫీచర్స్ మెను తెరువు నొక్కండి, ఫీచర్స్ మెను తెరువు.

మరిన్ని నొక్కండి, ఆపై సెట్టింగులు, మరియు తరువాత భాషలు.

alt-text-here

మీకు కావలసిన భాషలను (తెలుగు) ఎంచుకోండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న లేఅవుట్ను ఎంచుకోండి.

  1. Google అనువాదం —కీబోర్డ్‌లో మీరు తెలుగుని ఇంగీష్ లో టైప్ చేస్తున్నప్పుడు తెలుగు అక్షరాలలో లో అనువాదం చేస్తుంది

    alt-text-here

  2. తెలుగు కీబోర్డు -మీ వేలితో తెలుగు అక్షరాలను తాకుతూ వేగంగా టైప్ చేయడం

    alt-text-here

వాయిస్ టైపింగ్ —సులభంగా వచనాన్ని డిక్టేట్ చేయడం

చేతిరాత* —కర్సివ్, ప్రింటెడ్ అక్షరాలలో రాయడం

alt-text-here

Gboard లో వాయిస్ టైపింగ్

alt-text-here

alt-text-here

alt-text-here

తెలుగు లో వాయిస్ టైపింగ్ చెయ్యడంకోసం కీబోర్లు మూలన ఉన్న మైక్ ఐకాన్ ఓపెన్ చేసి వాయిస్ సెట్టింగులలో తెలుగుని ఎంపిక చేసుకోవాలి , ఇక్కడ తెలుగుని ఎంచుకోబోయే ముందు అప్పటికే డిఫాల్ట్ ఉన్న English ని ఆన్ చెక్ చేయాలి

చిట్కాలు

ఎల్లవేళలా సంఖ్యల అడ్డు వరుస అందుబాటులో ఉండేలా చేయండి (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంఖ్యల అడ్డు వరుస ఎంపికను ఎనేబుల్ చేయండి)

  1. సంకేతాల సూచనలు: ఎక్కువ సమయం నొక్కి ఉంచడం ద్వారా సంకేతాలను యాక్సెస్ చేయడానికి మీ 'కీ'లపై త్వరిత సూచనలను చూపుతుంది (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంకేతాల కోసం ఎక్కువ సేపు నొక్కి ఉంచు ఎంపికను ఎనేబుల్ చేయండి)
  2. సంజ్ఞ తొలగింపు: పలు పదాలను త్వరగా తొలగించడానికి 'డిలీట్ కీ' నుండి ఎడమ
  3. సంజ్ఞ కర్సర్ నియంత్రణ: కర్సర్‌ను జరపడానికి స్పేస్ బార్ మీదుగా మీ వేలిని జరపండికు స్లైడ్ చేయండి.

మీరు ఎక్కువగా Gboard వాడుతూ ఉంటే దానికిఉన్న కుత్రిమ మేధస్సు ద్వారా మరింత చక్కగా పనిచేస్తుంది.